KCR: ఎమ్మెల్సీ కవిత లేఖపై కేసీఆర్ సీరియస్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-22 16:57:49  IST  )

ఎమ్మెల్సీ కవిత లేఖపై కేసీఆర్ సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌విత రాసిన లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని ఆయ‌న ఆరా తీస్తున్నార‌ట‌.

KCR: ఎమ్మెల్సీ కవిత లేఖపై కేసీఆర్ సీరియస్!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత లేఖపై కేసీఆర్ సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ నేత‌ల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌విత రాసిన లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని ఆయ‌న ఆరా తీస్తున్నార‌ట‌. లేఖ‌లో క‌విత ప్ర‌స్తావించిన అంశాలు చ‌ర్చ‌లో ఉండ‌టంతో ఏం చేయాలి? అనేదానిపై కేసీఆర్ మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ క‌విత వరంగల్ బీఆర్ఎస్ సభపై పాజిటివ్స్, నెగిటివ్స్ అంటూ ఆరు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో కవిత కొన్ని విషయాలలో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపించింది.

మై డియ‌ర్ డాడీ అంటూ ఆమె ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగానికి ముందు 2001 నుండి పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌తో మాట్లాడించాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌భ‌లో పార్టీ నేత‌ల‌కు యాక్సెస్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ త‌న‌ను జైలుకు పంపింద‌ని, స‌భ‌లో బీజేపీపై మ‌రింత బ‌లంగా మాట్లాడితే బాగుండేద‌ని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పోటీ చేయ‌క‌పోవ‌డంతో నెగిటివ్ ప్ర‌చారం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. దీంతో క‌విత రాసిన లేఖ సంచ‌లనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఏం జ‌రుగుతోంది అన్న చ‌ర్చ మొద‌లైంది. మ‌రోవైపు గ‌త కొద్దిరోజులుగా క‌విత పార్టీపైనా అసంతృప్తితో ఉన్నారని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మయంలో లేఖ బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది.

Next Story