ఫామ్‌హౌజ్‌లో చండీయాగం అంటూ వార్తలు.. స్పందించిన KCR పీఆర్‌వో

by Gantepaka Srikanth |

ఫామ్‌హౌజ్‌లో చండీయాగం అంటూ వార్తలు.. స్పందించిన KCR పీఆర్‌వో

ఫామ్‌హౌజ్‌లో చండీయాగం అంటూ వార్తలు.. స్పందించిన KCR పీఆర్‌వో
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో చండీయాగం నిర్వహించబోతున్నారని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది రుత్వికులు కేసీఆర్, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై తాజాగా కేసీఆర్ పీఆర్వో రమేశ్ హజారి(Ramesh Hazari) స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో చండీయాగం నిర్వహిస్తున్నారని వార్తల్లో నిజం లేదు. ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీస సమాచారం తెలుసుకోకుండా వాస్తవాలను నిర్ధారించుకోకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో.. ఫామ్ హౌస్‌లో చండీయాగం.. అంటూ ప్రముఖ ఛానళ్లు, పత్రికలు అని చెప్పుకుంటున్న మీడియా సంస్థలు కూడా ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యం. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా, కేసీఆర్ ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కొనసాగిస్తున్న ఇటువంటి అవాస్తవాలను, అసత్యాలను, వార్తల పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలి. తమ తమ ఛానళ్ల నుంచి తొలగించాలని అన్ని పత్రికలు చానళ్ల యాజమాన్యాలను ఎడిటర్లను కోరుతున్నాం’ అని ప్రకటనలో డిమాండ్ చేశారు.

Next Story