- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకుపై కేసీఆర్ చిత్రం..
by Taduka Kalyani |
కళాకారుడు తలుచుకుంటే ఎంతటి అద్భుతాలైనా చేయగలడని నిరూపించాడు అల్వాల్ కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్.

X
దిశ, అల్వాల్: కళాకారుడు తలుచుకుంటే ఎంతటి అద్భుతాలైనా చేయగలడని నిరూపించాడు అల్వాల్ కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్ కుమార్. వృత్తి రీత్యా బంగారు ఆభరణాల తయారీదారుడు. సూక్ష్మ కళా చిత్రాలు చిత్రించాడు. ఇప్పటికే అనేక చిత్రాలు చిత్రించి చూపరులను ఔరా అనిపించడంతో పాటు అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నాడు.
జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదీప్ కుమార్ తన సూక్ష్మకళతో అద్భుత చిత్రాలు చిత్రించాడు. ఆవాలు, బియ్యపు గింజలపై బంగారు సన్నని తీగలతో జై కేసీఆర్ అక్షరాలను చిత్రించి కేసీఆర్ పైన ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు. అలాగే ఆకుపై తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రంతో పాటు ఇటీవల ప్రారంభించిన నూతన సచివాలయ భవనాన్ని చిత్రించి మహా అద్బుతం చేశాడు.
Next Story






