KCR: దేశ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అంబేద్కర్

by Gantepaka Srikanth |

అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం, సామాజిక న్యాయం కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు.

KCR: దేశ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అంబేద్కర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం, సామాజిక న్యాయం కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి చేసిన కృషిని స్మరించుకున్నారు. దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం, దళితబంధు సహా పలు పథకాల రూపంలో అమలు చేసిందని, పదేండ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు.

పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. భారత జాతి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని రాష్ట్రంలో నిలుపుకున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకాలను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని, అప్పుడే వారికి ఘన నివాళి అర్పించిన వారం అవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Next Story