Vemula Prashanth Reddy: కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆదేశించారు

by Gantepaka Srikanth |

‘సభ మీ సొంతం కాదు.. అందరిది’ అంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)ను ఉద్దేశించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి.

Vemula Prashanth Reddy: కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆదేశించారు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘సభ మీ సొంతం కాదు.. అందరిది’ అంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)ను ఉద్దేశించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్‌కు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్ కాబట్టే అలా తక్కువ చేసి మాట్లాడారని మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కావడం లేదని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 ఇస్తామని ఇవ్వలేదని.. హామీల అవలు చేయడం లేదని మాత్రమే సభలో జగదీశ్ రెడ్డి ప్రస్తావించారు.

‘ఈ సభ మనందరిది, ఈ సభలో ఉన్న సభ్యులందరికీ సమాన హక్కులు ఉండాలి.. కాంగ్రెస్ సభ కాదంటూ మా సభ్యుడు మాట్లాడారు’ అని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ మాత్రం దానికే స్పీకర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదు.. రాద్దాంతం చేయడమే సరికాదంటే ఏకంగా ఈ ఇష్యూను ఆసరాగా చేసుకొని నాలుగు గంటల పాటు సభ నిలిపి వేశారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ‘అసెంబ్లీలో జరిగింది మొత్తం మా నాయకుడు కేసీఆర్‌(KCR)కు వివరించాం. మీరు తప్పు మాట్లాడకున్నా సరే స్పీకర్‌కు హుందాగా క్షమాపణ చెప్పి సభ సజావుగా జరిగేలా చూడండి అని మాకు కేసీఆర్ చెప్పారు’ అని వెల్లడించారు.

సభలో జరిగిన దానిపై రికార్డులు పరిశీలించాలని.. ఒకవేళ తప్పు ఉంటే జగదీశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తారని చెప్పినా ఎవరూ స్పందించడం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. సభ నిర్వహించాలని కోరుతున్నామని చెప్పారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై రికార్డులను అఖిలపక్షాన్ని పిలిచి పరిశీలించండి.. తప్పు అని తేలితే సారీ చెబుతామని అన్నారు.

Next Story