KCR: ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

by Prasad Jukanti |

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు.

KCR: ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో (Erravalli Farm House) భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ (BRS) మాజీ, తాజా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్ లో (Warangal BRS Sabha) నిర్వహిస్తున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేసేలా నేతలకు కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని, బహిరంగా సభను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్న వేళ ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా సభకు జనసమీకరణ చేసేలా ప్రణాళికలు వేసుకోవాలని అధినేత సూచించారు.

Next Story