- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: గత పదేండ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) అన్నారు. దళిత, గిరిజన, బహుజన మహిళా వర్గాలకు కుల వృత్తులకు, గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, అమలుచేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం, తెలంగాణ పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని పేర్కొన్నారు. తాను దార్శనికతతో సీఎంగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు కేసీఆర్‌ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను వారిని కేసీఆర్ శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచారు.






