కవిత సస్పెండ్.. వరుసగా ఎర్రవల్లిలో రెండో రోజు కేసీఆర్ సమావేశాలు

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నుండి క‌విత‌ను స‌స్పెండ్ చేసే ముందు కేసీఆర్ ఆ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. క‌వితను స‌స్పెండ్ చేయాలి పార్టీ నుండి బ‌హిష్క‌రించాలా అనేదానిపై సుధీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు.

కవిత సస్పెండ్.. వరుసగా ఎర్రవల్లిలో రెండో రోజు కేసీఆర్ సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నుండి క‌విత‌ను స‌స్పెండ్ చేసే ముందు కేసీఆర్ ఆ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. క‌వితను స‌స్పెండ్ చేయాలి పార్టీ నుండి బ‌హిష్క‌రించాలా అనేదానిపై సుధీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. అంతే కాకుండా రెండో రోజు కూడా స‌స్పెండ్ చేసిన అనంత‌రం అర్ద‌రాత్రి వ‌ర‌కు కేసీఆర్ సీనియ‌ర్ల‌తో ఎర్ర‌వ‌ల్లి ఫాంహౌస్‌లో చర్చలు జరిపారు.

క‌విత‌ను స‌స్పెండ్ చేసిన త‌ర‌వాత పార్టీలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి అనే విష‌యంపై చ‌ర్చించారు. మ‌రోవైపు క‌విత‌ను స‌స్పెండ్ చేసిన వెంట‌నే బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో క‌విత‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం మొద‌లైంది. వ‌రుస పోస్టులు పెడుతూ ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. క‌విత శ‌త్రువుల‌తో చేతులు క‌లుపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ మ‌హిళా నేత‌లు సైతం మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసి క‌విత‌ను విమ‌ర్శించారు. ఇక నేడు క‌విత ప్రెస్ మీట్ లో క‌విత ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story