Harish Rao : కేసీఆర్ అంటేనే ఉద్యమం, అభివృద్ధి : హరీష్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-29 16:57:30  IST  )

కేసీఆర్(KCR) లేకపోతే తెలంగాణ ఆనవాళ్లు లేనట్టేనని బీఆర్ఎస్ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు.

Harish Rao : కేసీఆర్ అంటేనే ఉద్యమం, అభివృద్ధి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్(KCR) లేకపోతే తెలంగాణ ఆనవాళ్లు లేనట్టేనని బీఆర్ఎస్ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలోని అమరచింతలో నేడు తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్(Sai Chand) రెండవ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. అమరచింత కొత్త బస్టాండ్ ఆవరణలో సాయిచంద్ ఏడు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హరీష్ రావు తన ప్రసంగంలో సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర సాధన కోసం జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, "రేవంత్ రెడ్డి ఒక్కసారైనా 'జై తెలంగాణ' అన్నారా?" అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని, కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనవాళ్లు లేనట్టేనని ఆయన అన్నారు. హరీష్ రావు కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యమం, అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా అభివర్ణించారు, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను కొనియాడారు. ఈ సభలో సాయిచంద్‌ను స్మరిస్తూ, ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని కొనియాడారు.

Next Story