- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెలికాఫ్టర్‌లో ఎల్కతుర్తికి బయల్దేరిన KCR
బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఎల్కతుర్తికి బయల్దేరారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఎల్కతుర్తికి బయల్దేరారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ నుంచి హెలికాఫ్టర్‌లో ఒకరిద్దరు ముఖ్య నాయకులతో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి(Elkathurthy)కి బయల్దేరారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగంలోకి చేరుకుంటారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ(BRS Silver Jubilee) సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను పెట్టారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.
జనం కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు.. 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. వివిధ రూట్లలో ఆరు అంబులెన్స్‌లు.. పరిసరాల్లో 12 వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. 1,200 తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. అదే విధంగా పార్కింగ్ నిర్వహణకు 2,500 మంది వలంటీర్లను నియమించారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన ప్రజలు కూర్చునేందుకు లక్షకుపైగా కుర్చీలు వేయనున్నారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక అందరికీ కనిపించేలా 23 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు.






