- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎస్ఎస్‌తో టచ్‌లో కేసీఆర్ : కేఏ పాల్ సంచలన ఆరోపణలు
కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ మారడం లేదని ఆరోపించారు. కేసీఆర్ రూ. 600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్‌లో ఉంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలుపరుస్తున్నాడన్న ఆయన..తన కూతురు కవిత అరెస్ట్‌ను తప్పించకపోవడానికేనా ! అని నిలదీశారు. కేసీఆర్ బీజేపీ బీ-టీమ్ అని మరోసారి నిరూపించుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదని అన్నారు. మరోవైపు, తాను సెక్యులర్ అని చెప్పుకుంటున్న కేసీఆర్ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని పాల్ ప్రశ్నించారు.
రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన నిధులను ఒకటి, రెండు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నాడని మండిపడ్డారు. కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్రంలో సెక్యులర్ ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళతారని మండిపడ్డారు. ఇక, ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నందునే శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను నిజమైన హిందువునన్న పాల్ హిందువుగానే చనిపోతాను, కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతానని అన్నారు.






