KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్‌ కీలక సమావేశం.. ఆ విషయంపై చర్చ

by Prasad Jukanti |

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్‌ కీలక సమావేశం.. ఆ విషయంపై చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ (BRS) నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) భేటీ అయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సమావేశం అయ్యారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించే బీసీ గర్జన సభపై (BC Garjana Sabha) చర్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధానాస్త్రంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంలో అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా బీసీ సభకు ప్లాన్ చేస్తోంది. నిజానికి ఈ నెల 8వ తేదీననే ఈ సభ జరపాలనుకున్నప్పటికీ 14వ తేదీకి మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఢిల్లీలో ధర్నా నిర్వహించి వచ్చింది. ఆ సందర్భంగా బీసీల రిజర్వేషన్ కోసం క్షేత్ర స్థాయిలో తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేశామని ప్రభుత్వం పంపిన బిల్లులను, ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా రాష్ట్రపతిని బీజేపీ అడ్డుకుంటుంటే బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి కౌంటర్ గా బీఆర్ఎస్ ఈ సభ నిర్వహించతలపెట్టింది. ముఖ్యమంత్రి ఎటాక్ కు ఈ సభా వేదికగా కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.

Next Story