కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్!

by Ajay Maddhiboyina |

కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అప్డేట్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.

కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్!
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అప్డేట్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వస్తున్న వార్తలను శ్రవణ్ ఖండించారు. కేసీఆర్ సాధారణ జ్వరంతోనే ఆస్పత్రిలో చేరారని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ గురువారం సీజనల్ జ్వరంతో యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్సల అనంతరం సోడియం లెవల్స్ తగ్గాయని, బ్లడ్ షుగర్ పెరిగిందని వైద్యులు హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తునట్టు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఇక తాజాగా ఎమ్మెల్సీ శ్రవణ్ కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు.

Next Story