KCR : ఎర్రవల్లిలో కొనసాగుతున్న కేసీఆర్ హరీష్ రావు భేటీ.. ఆ నేత కూడా హాజరు!

by Muthe.Rajitha |

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ల సమావేశం కొనసాగుతోంది.

KCR : ఎర్రవల్లిలో కొనసాగుతున్న కేసీఆర్ హరీష్ రావు భేటీ.. ఆ నేత కూడా హాజరు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో BRS అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ల సమావేశం కొనసాగుతోంది. జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) ముందు హాజరుకానున్న నేపథ్యంలో.. వీరి సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) కూడా హాజరవడం మరింత పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోస్ కమిషన్(Justice PC Ghosh Commission) విచారణ కొనసాగుతోంది. ఈ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఈటల జూన్ 6న, హరీష్ రావు జూన్ 9న కమిషన్ ముందు హాజరయ్యారు. నిన్న తన విచారణ అనంతరం హరీష్ రావు 5 గంటలు కేసీఆర్ తో సమావేశమై, కమిషన్ ప్రశ్నలు, సమాధానాల గురించి చర్చించారు. నేడు మరోసారి కేసీఆర్, హరీష్ రావు సమావేశం అయ్యి.. తన విచారణ అంశాలు, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే విషయాలు, రాజకీయ, చట్టపరమైన ప్లాన్‌లపై చర్చించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్, NDSA నివేదికలు ఎత్తిచూపిన ప్రాజెక్టు లోపాలపై కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. కమిషన్ విచారణ, BRS నాయకుల రాజకీయ వ్యూహం రాష్ట్రంలో కీలకంగా మారింది.

Next Story