తెలంగాణ నీటి వ్య‌వ‌స్థ 'చిన్నా భిన్నం' కి కేసీఆర్, హ‌రీశ్ రావులే కార‌కులు : ప్ర‌భుత్వ చీఫ్ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ చిన్న బిన్నం కావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే కారణం అని ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ నీటి వ్య‌వ‌స్థ  చిన్నా భిన్నం కి కేసీఆర్, హ‌రీశ్ రావులే కార‌కులు : ప్ర‌భుత్వ చీఫ్ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ చిన్న బిన్నం కావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే కారణం అని ప్రభుత్వ చీఫ్ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం గా కేసీఆర్.. హ‌రీశ్ రావు నీటిపారుద‌ల‌, ఇటు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి.. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల విషయాలలో సరైన ప్రణాళికలు లేకుండా అస్తవ్యస్తం చేశారని ఎ న్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీశ్ రావు కొంత నిజాయితీగానే ఉన్నారు. తాను ఆయనతో పాటు పని చేశాను. ఆయన వ్యక్తిత్వం త‌న‌కు తెలుసు అన్నారు. కానీ అధికారం పోయాక అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యతను ఇవ్వడం లేదు అంటున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర విభాగాలలో బీసీలకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చామో ప్రజలకు తెలుసు అన్నారు. "మరి అధ్యక్షునిగా మీ కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను బీసీలకు ఎందుకు అప్పగించలేదు" అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించబోతుందని చెప్పారు. ఇందులో భాగంగా భావితరాలకు సరిపడ తాగునీరు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎన్నం వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కార్పొరేటర్లు శేఖర్, పెద్ద గొల్ల నర్సింలు, రమేష్ రెడ్డి, కిషన్ నాయక్, విటల్ రెడ్డి, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతన్న యాదవ్, యాదిరెడ్డి పాల్గొన్నారు.

Next Story