KCR: ఆసుపత్రి నుంచే కేసీఆర్ చిట్ చాట్.. పార్టీ నేతల నుండి ఫీడ్ బ్యాక్

by Prasad Jukanti |

ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ అక్కడ పార్టీ నేతలతో చిట్ చాట్ నిర్వహించారు.

KCR: ఆసుపత్రి నుంచే కేసీఆర్ చిట్ చాట్.. పార్టీ నేతల నుండి ఫీడ్ బ్యాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వైద్య పరీక్షల నిమిత్తం నిన్న సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital) చేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ ఆసుపత్రిలో నుంచే ప్రజాసమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తనను పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు రాగా ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే వారితో కేసీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించారు. వ్యవసాయం, సాగునీరు, రైతులకు యూరియా కొరత, ప్రజా సమస్యలతో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై వారి నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు ఎరువుల కొరత, బనకచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు.

Next Story