- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ప్రమాదంపై కేసీఆర్ సంతాపం
by Muthe.Rajitha |
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణ ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించారు.
Next Story






