- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌజ్ నుంచి బయల్దేరిన KCR.. నేరుగా అక్కడికే..
ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్(Erravelli Farmhouse) నుంచి బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హైదరాబాద్‌కు బయల్దేరారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్(Erravelli Farmhouse) నుంచి బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్(Telangana Bhavan) వేదికగా బీఆర్ఎల్పీ(BRLP) సమావేశం ఉన్న నేపథ్యంలో నేరుగా అక్కడికే వెళ్లనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో, మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, మార్చి 12వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు, అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఎప్పుడూ అటు వైపు కూడా రాకపోవటం గమనార్హం.
ఇప్పుడు కూడా అలాగే బడ్జెట్(Budget) ప్రవేశ పెట్టిన తొలిరోజే హాజరవుతారా? లేక సభ జరిగినన్నీ రోజులు వస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసిన అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) హాజరవుతారని క్లారిటీ ఇచ్చారు. ఎల్లుండి జరగబోయే గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని.. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని కేటీఆర్ వెల్లడించారు.






