ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన KCR

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌(KCR) అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో జరగనుంది.

ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన KCR
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌(KCR) అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి‌లోని ఫామ్‌హౌజ్ నుంచి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇవాళ మధ్యహ్నం 2 గంటలకు ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే 400 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపించారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలు, నెలాఖరులో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

ఇదిలా ఉండగా.. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత ప్రజల్లోకి రాలేదు. అటు తెలంగాణ భవన్‌లో సైతం ఆయన ఎప్పుడూ అడుగుపెట్టలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్‌లో ఓటమితో అప్పటి నుంచి ఆయన ఫామ్‌హౌజ్‌(KCR Farmhouse)కే పరిమితమయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌లో సమావేశానికి హాజరవుతున్నారు. దీంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.

Next Story