- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. ఈ నెల 19న జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్?
ప్రచారం పై దృష్టి సారించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ స్కెచ్‍లు వేస్తోంది. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్‍కు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jublihills Bypoll) కారు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరికంటే ముందే దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన అధినేత కేసీఆర్ నిన్న ఆమెకు బీఫామ్ అందజేశారు. ఇవాళ కేటీఆర్‍తో పాటు వెళ్లిన సునిత తన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ప్రచారం పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాస్ కేసీఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్:
ఈ ఏడాది ఏప్రిలో లో ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కనిపించని కేసీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో అడుగుపెట్టబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్న మాజీ సీఎం.. ఇక ప్రచారానికి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూయెన్సీలో బీఆర్ఎస్ ఈ నెల 19న భారీ స్థాయిలో రోడ్డు షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోడ్డుషోలో కేసీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. తమ అభ్యర్థి సునీతకు బి-పామ్ అందజేసే సమయంలో అధైర్య పడవద్దని తానూ జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రచారంలో కేసీఆర్ (KCR Camgain) పాల్గొంటే దాదాపు ఆరునెలల తర్వాత రాజకీయ వనవాసం వీడినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒక్కసారి ప్రచారానికి వచ్చి వెళ్లినా చాలు అని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుండగా దాదాపు ఆర్నెళ్లుగా ప్రజా క్షేత్రానికి దూరంగా ఉన్న కేసీఆర్ నిజంగానే బయటకు రాబోతున్నారా లేదా కేటీఆర్, హరీశ్ రావు ప్రచారంతోనే సరిపెట్టేస్తారా అనేది వేచి చూడాలి.
Read More: Kavitha: కేసీఆర్ పేరు చెప్పి బతకాలనే ఉద్దేశం నాకు లేదు.. జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరణలో కవిత






