‘నువ్వు టెంప్ట్ అవ్వకు’.. కేటీఆర్‌కు కేసీఆర్ ఫోన్

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ వేడెక్కింది.

‘నువ్వు టెంప్ట్ అవ్వకు’.. కేటీఆర్‌కు కేసీఆర్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ వేడెక్కింది. ఆదివారంతో ప్రచార సరళి ముగుస్తుండంతో ప్రధాన పార్టీల నేతలంతా వేగం పెంచారు. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నేతలంతా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. రెండ్రోజుల క్రితం కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సైతం స్పందించి కౌంటర్ ఇచ్చారు. అయితే.. రేవంత్ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్‌కు కేసీఆర్‌ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే రివీల్ చేశారు. శనివారం కేటీఆర్ ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు.

‘‘ఇటీవల నన్ను రేవంత్ రెడ్డి తిట్టినప్పుడు, కేసీఆర్ ఫోన్ చేశారు.. ఓడిపోతున్నామనే విషయం రేవంత్‌కు అర్థమయింది, అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు.. నువ్వేం టెంప్ట్ అవ్వద్దు.. ఎదుగుతున్న నాయకుడు సంయమనంతో, హుందాగా మాట్లాడాలి.. అన్ని పార్టీల అధ్యక్షులు ఈ పద్ధతి పాటిస్తే, రాజకీయాలకు హుందాతనం పెరుగుతుంది.. ఈ సంస్కృతికి మనేమే పునాది వేద్దాం’’ అని కేసీఆర్ తనతో అన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వీడియో

Next Story