రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. హాజరు కానున్న కేసీఆర్

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. హాజరు కానున్న కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు జనవరి మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడటానికి కారణం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలకు హాజరుకానుండటమే. గత కొన్ని సమావేశాలకు ఆరోగ్య కారణాలు, ఇతర కారణాలతో దూరంగా ఉన్న కేసీఆర్ మళ్లీ సభకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు.

సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సమీక్ష, హామీల అమలులో లోపాలు, రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే అవకాశముంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story