హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-19 11:59:59  IST  )

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌(Kaleshwaram Commission Report) విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. రేవంత్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌(Kaleshwaram Commission Report) విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని హైకోర్టు(Telangana High Court)ను కేసీఆర్‌ ఆశ్రయించారు. జస్టిస్‌ ఘోష్ నివేదికను సవాల్‌ చేస్తూ కేసీఆర్‌, హరీష్‌రావు.. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాగా, కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదికకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్‌ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని సీఎం రేవంత్ చెప్పారు. అంతేకాదు.. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరిస్తామని అన్నారు.

Also Read..

Marwadi go back: 'డిప్యూటీ సీఎం మా పెద్ద బావ'.. ‘మార్వాడీ గో బ్యాక్’ వివాదం వేళ సీన్ లోకి భట్టి పేరు

Next Story