- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. అనూహ్యంగా విచారణ తేదీ మార్పు
కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram)తో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పీసీ చంద్రఘోష్ (Justice PC Chandraghosh) నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Project)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ (KCR)తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు (Harish Rao), ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటల రాజేందర్ (Etala Rajender)లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5న కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని.. జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్, కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11కు వాయిదా వేసింది.






