- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ (KCR) కుమ్మక్కయ్యారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఒక్కటని ఎవరూ అనరని, అవన్నీ కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి కట్టుకథలని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీతో పోరాడింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోవడానికి బీఆర్ఎస్‌దే బాధ్యత అని అన్నారు. డ్రగ్స్ విషయంలో గతంలో ఐపీఎస్ అకున్ సబర్వాల్ (Akun Sabharwal) ఇచ్చిన రిపోర్టు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక కేసుల్లో కేసీఆర్ కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఒక్కటా.. లేక బీజేపీ పోరాటం నిజమా అనేది ప్రజలే తేలుస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.






