- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, హరీశ్‌రావుకు ఉరేసినా తప్పులేదు.. నిప్పులుచెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను అసలు కేసీఆర్ వినిపించలేదని ఆరోపించారు. నీటి వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో వాదనను వినిపించలేదని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలతో నేడు ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయని అన్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరును మార్చడంతో నీళ్ల విషయంలో ఏపీకి కేసు వేసే అవకాశం వచ్చిందని అన్నారు. ఐదేళ్ల వరకు రూ.20 వేల కోట్ల బిల్లులు చెల్లించే వరకు కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేదని, ఎలాంటి అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని గుర్తు చేశారు. అనంతరం ఆ దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకు డీపీఆర్‌ను దాచారని పేర్కొన్నారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పైగా పెంచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రూ.వేల కోట్ల కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..
ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానని, బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్ధాల పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫస్ట్ వస్తారంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని, ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగదని తెలిపారు. రూ. వేల కోట్ల కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేలాలని అన్నారు. జూరాల నుంచి ప్రాజెక్టును మార్చడంతో లోతైన అవినీతి జరిగిందని అన్నారు. అదే జూరాల వద్ద ప్రాజెక్టును కట్టి ఉంటే కావాల్సినన్ని నీళ్లు తీసుకునేవాళ్లమని పేర్కొన్నారు. మన భూభాగంలో మనం నీళ్లు తీసుకొని ఉంటే చంద్రబాబు, జగన్ ఢిల్లీలో మొత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి మన శక్తి సరిపోదన్నారు. పాలమూరుపై వాస్తవాలు చెప్పేసరికి బనకచర్ల పేరుతో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైందని అన్నారు. అందుకే పార్టీని మళ్లీ బతికించుకునేందుకు కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీకి ఎవరైనా నీళ్లిస్తారా..
పాలమూరు-రంగారెడ్డిపై విచారణ చేపట్టి తప్పు ఎవరిదో తేలుస్తామనేసరికి బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. తిరిగి తమనే ఏపీకి తెలంగాణ నీళ్లు తాకట్టు పెట్టామంటూ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీకి ఎవరైనా నీళ్లిస్తారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కంటే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్దు ర్మార్గులన అన్నారు. మామ, అల్లుడికి ఉరేసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తప్పు మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్లని పేర్కొన్నారు. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆరే తెలంగాణ అన్యాయం చేశారని కామెంట్ చేశారు. కనీసం డాక్యుమెంట్లు కూడా కనిపించకుండా చేశారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో ఆదిత్యనాథ్ దాస్ పూర్తి అనుభవం ఉన్న అధికారి అని, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులపై దాస్‌కు అవగాహన ఉందన్నారు. అందుకే ఏపీ నుంచి ఆయనను తెలంగాణకు తీసుకొచ్చామని అన్నారు. ఆయనది ఏపీ, తెలంగాణ కాదని, బిహార్ రాష్ట్రానికి చెందిన వారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






