BC reservations: ఇకనైనా న్యాయపోరాటం చేయండి.. రేవంత్ రెడ్డికి కవిత డిమాండ్

by Prasad Jukanti |

కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలని కవిత డిమాండ్ చేశారు.

BC reservations: ఇకనైనా న్యాయపోరాటం చేయండి.. రేవంత్ రెడ్డికి కవిత డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఇవాళ ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ నాకు ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందిందని.. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు‍ను ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలన్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఇకనైనా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.

బిల్లులు పెండింగ్ లో ఉండగా జీవో:

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోలేదని కవిత అన్నారు. అలాగే 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‍లో ఉందన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‍లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు.

Next Story