ప్రధాన అనుచరులతో కవిత రహస్య భేటీ..! బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వబోతోందా?

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా అంతా రెండు రోజుల వ్యవధిలోని జరిగిపోయాయి.

ప్రధాన అనుచరులతో కవిత రహస్య భేటీ..! బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వబోతోందా?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా అంతా రెండు రోజుల వ్యవధిలోని జరిగిపోయాయి. అయితే, తనకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదని.. ఏ పార్టీలోనూ చేరబోనని ఇప్పటికే ఆమె కుండ‌బద్దలు కొట్టారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ మేరకు ఇవాళ ఆమె తన ప్రధాన ఆనుచరులు, జాగృతి ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఆ భేటీలో కొత్తగా పార్టీ పెడితే.. తన వెంట నడిచేది ఎవరని ఆరా తీసినట్లుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ.. అక్కడ ప్రాధాన్యం దక్కని ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేల జాబితాను తయారు‌చేసే పనిపై కవిత ఫోకస్ పెట్టారని టాక్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పని‌ చేసిన ఉద్యమ‌కారులను జాగృతిలో చేరాలని కవిత కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇవాళ కల్వకుంట్ల కవిత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవబోతున్నట్లుగా సమాచారం.

BRSపై సస్పెన్షన్ ప్రభావం ఉంటుందంటున్న విశ్లేషకులు..

బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి కవితను బహిష్కరించడం ఆ పార్టీపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత వ్యవహారం బీఆర్ఎస్‌పై ప్రభావం చూపించేదిగానే చూడాలని అంటున్నారు. కొందరేమో కవిత సస్పెన్షన్ విషయం ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతుందని కామెంట్ చేస్తున్నారు. హరీష్ రావు ఏ పనిచేసినా కేసీఆర్ అనుమతి లేకుండా చేయరనే విషయం జగమెరిగిన సత్యమని.. కవిత హరీశ్‌పై అభియోగాలు మోపితే పరోక్షంగా కేసీఆర్‌పై మోపినట్లేనని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు ‘కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్’ తెలంగాణకు వరప్రదాయని అంటూ బీఆర్ఎస్ జబ్బలుచరిచిందని.. తాజాగా హరీశ్‌రావుపై కవిత చేసిన అవినీతి ఆరోపణలతో ఆ పార్టీ పూర్తిగా డిఫెన్స్ పడినట్లైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొత్త పార్టీ పెడితే.. మనుగడ సాధ్యమేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నాయకులు తాము ఉన్న పార్టీలను విభేదించి ఇతర పార్టీలో చేరారు. రాజకీయంగా అస్తిత్వం ఉన్న కొద్దిమంది నేతలు మాత్రమే సొంతంగా పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన పార్టీలు ఉన్నాయి. పార్టీలు పెట్టడం సులభమేనని.. నడపడమే తలకుమించిన భారమనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మర్రి చెన్నారెడ్డి, తూళ్ల దేవేందర్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, విజయశాంతి, వైఎస్ షర్మిల పెట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే, తాజాగా కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పెట్టబోయే పొలిటికల్ పార్టీ ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతుందా..? లేక తిరుగులేని శక్తిగా ఎదుగుతుందా..? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Next Story