- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: లోకమంతా చూసిన ఈ విషయం మీ దృష్టికి రాలేదా? స్పీకర్‍కు కవిత ప్రశ్న
ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌ను తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కొట్టివేయడంపై కవిత రియాక్ట్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‍కు (Jagtial MLA Sanjay) శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) క్లీన్‍చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్‍కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‍లో పాల్గొన్నారంటేనే పార్టీ ఫిరాయించినట్టు కదా! ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారు? అంటూ ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్‍పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ఇవాళ కొట్టేశారు. సంజయ్‌పై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ స్పీకర్ నేడు తీర్పునిచ్చారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు.
ఆ విషయం మీ దృష్టికి రాలేదా?
మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ లు ఇవ్వడం ఎంత వివాదాస్పదం అయ్యిందో లోకమంతా చూసిందని అయినా ఆ విషయం మీ దృష్టికి రాలేదా? అని కవిత స్పీకర్ ను ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసిన స్పీకర్.. మీరు రాజ్యాంగ బద్దమైన స్పీకర్ చైర్‍లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా? అదే నిజమైతే మీరు భారత రాజ్యాంగాన్ని, చట్ట సభల ఔన్నత్యాన్ని ఎలా కాపాడగలుగుతారు? అని నిలదీశారు.
నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నా:
స్పీకర్ నిర్ణయంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచానని ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. అలాగే తాను బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నానని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని స్పష్టం చేశారు.






