సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

by Disha Web Desk 2 |
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు ఈడీ సమన్లు జారీ చేయడం, అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయినందున ఆ పిటిషన్ నిరర్థకమైందని, అందుకే వెనక్కి తీసుకుంటున్నామని వారు వివరించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇచ్చి.. కేసును 11 గంటలకు పాస్ ఓవర్ చేసింది. ప్రస్తుతం కవిత ఈడీ కష్టడీలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సుదీర్ఘంగా సోదాలు జరిపి.. అనంతరం అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 7 రోజుల కస్టడీ విధించింది.


Next Story

Most Viewed