- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
kavitha: బీఆర్ఎస్ లో లేఖ దుమారం.. మరికాసేపట్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కవిత?
by Prasad Jukanti |
తాను రాసిన లేఖపై పార్టీలో దుమారం రేపుతున్న వేళ కవిత మరికాసేపట్లో కేసీఆర్ తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత (Kavitha) మరికాసేపట్లో.. బీఆర్ఎస్ అధినేత, తండ్రి కేసీఆర్‌ను (KCR) కలువనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ బీఆర్ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇవాళ ఎర్రవల్లిలోని మాజీ సీఎం ఫాంహౌస్‌కు (Erravalli Farm House) వెళ్లి బాపుకు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్నే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కవిత.. పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అవుతారనే ప్రచారం అవుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాత్రి మీడియాతో మాట్లాడిన కవిత తాను తండ్రికి రాసిన లేఖ బహిర్గతంపై విస్మయం వ్యక్తం చేయగా ఈ మధ్యాహ్నాం తండ్రిని కలుస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేఖలో ప్రస్తావించిన అంశాలు, అదీ ఎలా బహిర్గతం అయిందనే దానిపై కవిత నేరుగా కేసీఆర్ మాట్లాడబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Next Story






