Kavitha: కవిత కొత్త పార్టీ పేరుపై వీడిన సస్పెన్స్.. బీఆర్ఎస్‌‌ను భళే ఇరికించేసిందిగా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-24 06:33:02  IST  )

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ వద్ద వెలిసిన తోరణాలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

Kavitha: కవిత కొత్త పార్టీ పేరుపై వీడిన సస్పెన్స్.. బీఆర్ఎస్‌‌ను భళే ఇరికించేసిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది, ఇది పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని ఉండవచ్చని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ కొత్త పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆ పేరు టీఆర్ఎస్ (TRS) నుంచి బీఆర్ఎస్‌‌ (BRS)కు దగ్గరగా ఉండటంతో ఆ పార్టీని ఇరకాటంలో పడిసినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు.

అయితే, స్వాగత బోర్డులపై తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా గోల్కొండ (Golconda) కోట, కాకతీయ (Kakatiya) తోరణం డిజైన్లను పొందుపరిచారు. ఇది పార్టీ తెలంగాణ అస్తిత్వం, వారసత్వమే అజెండాగా ముందుకు వెళ్తుందని సూచిస్తోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారైందని ప్రచారం జరుగుతుండగా, సభా ప్రాంగణంలో ‘తెలంగాణ ప్రజావికాస్ సమితి’ అని ఉండటంతో కార్యకర్తల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు పార్టీ పేరు ఇదేనా లేక ఇది పార్టీ అనుబంధ విభాగమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story