- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పిలిచినా వెనక్కి పోయేది లేదు.. ఫ్యామిలీని తలుచుకుని కవిత కంటతడి
కేసీఆర్ పిలిచినా పోయేది లేదు.. ఫ్యామిలీని తలుచుకుని కవిత కంటతడి

దిశ, డైనమిక్ బ్యూరో: తన మనసు విరిగిపోయిందని తిరిగి కేసీఆర్ (KCR) పిలిచినా మళ్లీ వెనక్కి వెళ్లబోయేది లేదని కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పుట్టింటి మీద ఆడపిల్లలకు కోపం రాదు. ఒకసారి కోపం వస్తే అంత త్వరగా చల్లారదన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురుగా ఎవరున్నా పోరాటం చేయాల్సిందేనని అది కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా సరేనన్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్‍ను కూడా సమ దూరం పాటిస్తామన్నారు. అవతల కేసీఆర్, కేటీఆర్ (KTR) ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ వారు ఆలోచించుకోవాల్సింది కదా అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజుతోనే రక్తసంబంధాల కన్న రాజకీయాలు ఎక్కువైపోయాయని తాను డిసైడ్ అయ్యాననని చెప్పుకొచ్చారు. సమంతపై (Samantha) మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిచిన కేటీఆర్ మీ విషయంలో ఎందుకు స్పందించలేదని జర్నలిస్ట్ అడుగగా.. తాను అదే చెబుతున్నానని కేటీఆర్‍పై కేసు వస్తే పార్టీ అంతా అండగా నిలబడుతుంది. మరి నా విషయంలో ఎందుకు నిలబడలేదనేదే నా ప్రశ్న అన్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేయలేదని తన తల్లితో రోజు మాట్లాడతానన్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటే వనరులు, మనుషులను సమకూర్చుకోవాల్సిందని అందుకోసం కొంత సమయం పడుతుందన్నారు.
ఆ విషయం తలుచుకుని కంటతడి:
కేసీఆర్ ను ఏమి చేయలేక కవితపై బీజేపీ కక్ష సాధిస్తూంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను డిఫెండ్ చేయలేకపోయిదన్నారు. ఈ మూడేళ్లు తానే ఒంటరిగా సోషల్ మీడియా, ఈడీ, సీబీఐతో పోరాటం చేశానన్నారు. ఆ సమయంలో పార్టీ నాతో నిలబడలేదని కేవలం తన కుటుంబం మాత్రమే తనకు సపోర్టుగా నిలిచిందన్నారు. అది కూడా తాను కుటుంబ సభ్యురాలిని కావడం వల్లేనన్నారు. జైలుకు వెళ్లివచ్చాక కూడా పార్టీ తనకు మద్దతు ఇవ్వలేదని భావోద్వేగానికి లోనయ్యారు. అంతిమంగా తాను కేసీఆర్ కూతురినని పోరాటం చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి జరిగుతున్న నష్టాన్ని కేసీఆర్ వద్దతు తీసుకువెళ్తే అలాంటి వారిని పార్టీ నుంచి దూరం చేయడం నా విషయంలోనే కాదు అనేక మంది వారికి జరిగిందన్నారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి అనేక మంది బీఆర్ఎస్‍లో ఇబ్బందిపడి చివరుక బీజేపీ, కాంగ్రెస్‍కు వెళ్లారని అన్నారు. ఎవరైనా కార్యకర్తలు తనను కలిస్తే అలాంటి వారిని ఎమ్మెల్యేలు వేధింపులకు గురి చేశారని అన్నారు. ఒక్క 20 మంది అభ్యర్థులను మార్చి ఉంటే ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెలపై చెయిపెట్టుకుని ఆలోచించాలన్నారు.
వారిని కేసీఆర్ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు:
పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు నుంచి ఇంకా బయటపడలేదని కుటుంబానికి దూరం కావడం అంత తేలికైన పని కాదన్నారు. కొంతమంది స్వార్థపరులు కేసీఆర్ వద్ద ఉన్న పవర్‍ను తాము తీసుకునేందుకు ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ వద్ద ఉన్న కోటరీ కేసీఆర్ కంటే పెద్దదైపోయిందని అందువల్లే ఈ పరిస్థితి అన్నారు. కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి తనను పార్టీ నుంచి బయటకు పంపించారని ఒక వేళ కేసీఆరే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఉరి తీసే ముందైనా వివరణ అడగాలి కదా ఇది బాధ కలిగిస్తోందన్నారు. నేనే ఏదైనా నేరుగానే చెప్తానని 2014లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను కలవాలిసి ధైర్యం చెప్పాలని కేసీఆర్‍కు రెండుమూడు సార్లు రిక్వెస్ట్ చేశాను. కానీ వారిని కలవలేదు. ఆ తర్వాత ఓడిపోయిన అభ్యర్థులను అధినేత కలవకపోవడం పార్టీలో ట్రెండ్ గా మారిందన్నారు. మనకోసం నిలబడి కొట్లాడి, డబ్బులు ఖర్చు చేసుకున్నవారిని కలవలేదని తన విషయంలోనూ ఇదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మా కుటుంబంలోనూ వివక్ష పరిస్థితులు:
పార్టీలో నాకు ఇబ్బంది అవుతోంది అని తెలంగాణ భవన్ లో కూర్చుని ఓ ఆడబిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తే కనీసం పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెస్పాన్స్ లేదంటే ఎలా అర్థం చేసుకోవాలని కవిత ప్రశ్నించారు. దేశమంతటా ఉన్నట్లుగానే కుటుంబంలోని ఆడబిడ్డ, మగబిడ్డ మధ్య వివక్ష విషయంలో మా కుంటుబంలో మినహాయింపు కాదన్నారు. తన పట్ల వివక్ష జరుగుతోందనే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రైవేట్ గా కేసీఆర్‍తోనూ, అమ్మతో చెప్పానన్నారు. అన్న కేటీఆర్ తో రాజకీయాంగా చెప్పానని నీ లబ్ధి కోసమే నేను నీవెనక నిలబడి ఉన్నానని మీరు నన్ను చూసుకోవాలి, కాపాడుకోవాలని కేటీఆర్‍తో చెప్పాను. కానీ కేవలం జైల్లో ఉన్నప్పుడు మాత్రమే కాపాడుతానంటే కాదు కదా అన్నారు. కేటీఆర్‍పై కేసు అయితే పార్టీలో అందరూ స్పందించారు. కానీ నాపై కేసు అయితే ఎవరూ రాలేదన్నారు. నేను కూడా మీ పార్టీ లీడరే కదా అన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా తాను చేయాల్సిన పనులు సరిగా చేయలేదనేది తన ప్రధానమైన ఆరోపణ అని అలాగేతాను దెయ్యాలు అని చెప్పిన జాబితాలో కేసీఆర్ లేరన్నారు.
ఎన్నటికైనా హరీశ్ రావు వెన్నుపోటు:
హరీష్ రావు, సంతోశ్‍రావు ఎవరి కోటరీ వారికి ఉందని ఆరోపించారు. ఈ కోటరీనుంచి పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను కాపాడాల్సిన బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా హరీశ్ రావు ముప్పుగానే ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎన్టీఆర్‍కు చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పోడిచారని ప్రజలు చెప్పుకుంటారో కేసీఆర్‍కు హరీశ్ రావు అలాగే వెన్నుపోటు పొడిచారని ప్రజలు మాట్లాడుతారన్నారు. కేసీఆర్‍కు హరీశ్ రావు వెల్ విషర్ అని నేను అనుకోవడం లేదని ఈ విషయం కేసీఆర్ అర్థం చేసుకుంటే బాగుంటుందన్నారు. 2016 మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరు అనేది పదే పదే ప్రశ్నలు వచ్చాయని అంతకు ముందే కేటీఆర్ ను సీఎం చేయాలనేది మా ఇంట్లో చర్చ జరిగిందన్నారు.






