మీరు నా వల్ల ఓడిపోయారా? కేటీఆర్ ట్వీట్‌‌పై కవిత ఫైర్

by Ajay Maddhiboyina |

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి లిక్కర్ కేసు కారణం అని కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత స్పందించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా అంటూ ప్రశ్నించారు.

మీరు నా వల్ల ఓడిపోయారా? కేటీఆర్ ట్వీట్‌‌పై కవిత ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి లిక్కర్ కేసు కారణం అని కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత స్పందించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా అంటూ ప్రశ్నించారు. ఓటమికి లిక్కర్ కేసు కారణం అని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారన్నారు. తనపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని ప్రశ్నించారు. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పుడు, తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని అన్నారు. తప్పు చేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అంటూ సమాధానం షాకింగ్ కామెంట్లు చేశారు.

Next Story