కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి.. కవిత సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-20 06:39:08  IST  )

షార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్‌పై చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, కేటీఆర్ సోద‌రి క‌విత స్పందించారు.

కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి.. కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: షార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్‌పై చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, కేటీఆర్ సోద‌రి క‌విత స్పందించారు. బీజేపీ వాళ్ల‌కు వాళ్ల మీద వీళ్ల‌మీద కేసులు పెట్ట‌డం త‌ప్ప మ‌రొక ప‌నిలేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ప‌థ‌కాలు ఏవీ అమ‌లు చేయ‌లేద‌ని వారికి బ‌స్తీల్లో ముఖం చూపించుకునే అంత లేద‌న్నారు. కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌పై కేసులు పెట్టాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. కానీ ప్ర‌జ‌లు గ‌మ‌ణిస్తార‌ని చ‌ట్టం, న్యాయం అనేవి ఉన్నాయ‌న్నారు. ఈ దేశంలో కుట్ర‌పూరిత రాజకీయాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. దానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయ‌ని తాను నంబ‌ర్ వ‌న్ అయితే మిగితా వాళ్లు అంతూ నంబ‌ర్ 2,3,4 అని వ్యాఖ్యానించారు.

Next Story