కర్నూల్ బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురి చేసింది: క‌విత‌

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-24 04:10:38  IST  )

క‌ర్నూల్ బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌విత సోష‌ల్ మీడియాలో స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

కర్నూల్ బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురి చేసింది: క‌విత‌
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నూల్ బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌విత సోష‌ల్ మీడియాలో స్పందించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోన్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు. మృతుల‌ కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉంటే క‌ర్నూల్ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌మాదంలో 20 మంది మ‌ర‌ణించారు. 12 మంది ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో హైదరాబాద్ వాసులు సైతం ఉన్నట్టు సమాచారం అందుతోంది.

Next Story