- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కాదు కవిత.. ఢిల్లీలో ధర్నా చెయ్: పొన్నం ప్రభాకర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధకై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ మహా ధర్నా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధకై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ మహా ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ధర్నాకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని కామెంట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగులకు, విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం (BJP) ఢిల్లీలో మాత్రం మోకాలడ్డుతోందని ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో కాదు.. ఢిల్లీలో కవిత ధర్నా చేయాలని హితవు పలికారు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కానీ, ఆమె పొలిటికల్ డ్రామాలకు తెర లేపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.






