- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత మరో షర్మిల కాబోతోంది.. ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు ఒక్కోక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత లేఖపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా.. లేక ఆస్తుల పంచాయితీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని కామెంట్ చేశారు.
పార్టీ నుంచి కవితను కట్టుబట్టలతో బయటకు పంపేందుకు కేటీఆర్ (KTR)తో పాటు హరీశ్ రావు (Harish Rao) ఒక్కటయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని.. ఆమె వెంట ఉండి అంతా నడిపిస్తోంది పాత బిజినెస్ పార్ట్నర్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏం చేసినా.. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Also Read: కవిత లేఖపై కాంగ్రెస్ ప్రమేయం లేదు.. నెం 02 పొజిషన్ కోసం.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్






