Kavitha: కవిత నోట ‘జై ఆంధ్ర’ నినాదం.. కొత్త పార్టీపై తిరుపతిలో కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-05 09:44:33  IST  )

తిరుపతి పర్యటనలో కల్వకుంట్ల కవిత "జై ఆంధ్ర" అంటూ నినాదం చేశారు.

Kavitha: కవిత నోట ‘జై ఆంధ్ర’ నినాదం.. కొత్త పార్టీపై తిరుపతిలో కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నూతన పార్టీ అంశం ఆసక్తిగా మారింది. త్వరలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వంతో బలమైన శక్తిగా వచ్చేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత నోట జై ఆంధ్ర (Jai Andhra) మాట రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తిరుపతి పర్యటనకు వెళ్లిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో మాట్లాడుతూ జై ఆంధ్ర అంటూ నినాదం చేశారు. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు.

నాలుగేళ్లు నన్ను వేధించారు:

తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారని సత్యం నా వైపు ఉండటం, దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని కవిత అన్నారు. వేంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో నమ్మకం అని కోర్టు కేసులో క్లీన్ చీట్ రావడంతో కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందన్నారు. ఈ మొక్కును తీర్చుకునేందుకు తాను తన కుటుంబ సభ్యులతో పాటు జాగృతి కుటుంబంతో తిరుపతి వచ్చానన్నారు. కాగా ఇవాళ ఉదయంశంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కవిత తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

ఏదైనా వ్యూహామా?:

కవిత చేసిన జై ఆంధ్ర నినాదం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు రాజకీయం సమీకరణాల్లో కీలకంగా మారారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాల ప్రయత్నాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే నూతన రాజకీయ వేదికగ ద్వారా తన పొలిటికల్ కెరీర్‍లో ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్న కవిత.. తాజాగా ఏపీ పర్యటనలో ఉన్నారు కాబట్టి యాదృచ్ఛికంగా అలా అన్నారా లేదా ఈ నినాదం వెనుక ఎదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది.

Next Story