- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: కేసీఆర్‍పై డోస్ పెంచిన కవిత.. సొంత పార్టీపై మరో కీలక ప్రకటన
కేసీఆర్ ఉద్యమంపై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉద్యమ సోయి లేని రేవంత్ రెడ్డి సీఎం కావటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. ఇవాళ బాగ్ లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో పాల్గొని మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్‍లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా ప్రకటించకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించడం లేదని ప్రొఫెసర్ కోదండరామ్‍ను హెచ్చరిస్తున్నానన్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రేవంత్ రెడ్డితో కలవటంతోనే కాంగ్రెస్‍ను నమ్మామని కానీ వాళ్లు రెండున్నరేళ్లుగా ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు.
త్వరలో రాజకీయ పార్టీ:
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లు ఉద్యమం అనే అగ్గి పుట్టాక 2001లో కేసీఆర్ పార్టీ పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని కవిత చెప్పారు. 1995లోనే వరంగల్ డిక్లరేషన్‍తో మలిదశ ఉద్యమం మొదలైందని ఈ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ప్రజాసంఘాల నాయకులు కీలకంగా వ్యవహరించారన్నారుత్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. పదేళ్లు బీఆర్ఎస్ కు ఉద్యమకారులు అధికారం ఇస్తే అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఈ విషయంలో ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే నేను బీఆర్ఎస్‍లో ఉండి బాధపడ్డానన్నారు. మనవాళ్లే గాయం చేయటంతో నొప్పి ఎక్కువగా ఉంది. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించారు. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ అన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, మంచితనం, సహనశీలత, భోళాతనం తెలంగాణ తత్వం అన్నారు. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనని చెప్పారు.
స్థానికులకు 20 శాతం రిజర్వేషన్లు:
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని బిల్డింగ్ బయటికి గుంజుతరని మనవాళ్లు కాదు. ధర్మం వైపు ఉండాలని శ్రీ కృష్ణుడు చెప్పారన్నారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉంది. వారి కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించాం. కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం అన్నారు. మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డ అన్ని చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహాం పెట్టాలని అప్పటి మున్సిపల్ మినిస్టర్ ను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. ట్యాంక్ బండ్ పై కూడా జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోయామన్నారు.






