- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదన.. క్లారిటీ ఇచ్చిన కవిత
రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె రాసిన ఆరు పేజీల లేఖ వైరల్ అవ్వడంతో అటు పార్టీలో, ఇటు రాజకీయాల్లో అలజడి రేగింది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె రాసిన ఆరు పేజీల లేఖ వైరల్ అవ్వడంతో అటు పార్టీలో, ఇటు రాజకీయాల్లో అలజడి రేగింది. లేఖలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటూ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడంతో పలు అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ కొందరు చెబుతుంటే మరికొందరు సొంత పార్టీ పెట్టబోతున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే కవిత కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతిపాదన పెట్టినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఆరు ఎమ్మెల్యేతో వస్తా మంత్రి పదవి ఇస్తారా? అంటూ కవిత కాంగ్రెస్ పార్టీని కోరినట్టు తమకు పక్కా సమాచారం అందిందని ఓ పత్రిక కథనాన్ని రాసుకొచ్చింది. జైలు నుండి వచ్చిన తరవాత కవిత స్వరంలో మార్పు వచ్చిందని, వరుస పర్యటనలు నిజం కాదా అని ప్రశ్నించింది. అయితే ఈ వార్తలపై కవిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఫేక్ న్యూస్ అంటూ ఒకే మాటతో కొట్టిపారేశారు.






