- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎకరానికి రూ.10 వేల సాయం సరిపోదు.. రూ.50 వేలు ఇవ్వాలి: కవిత
తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10వేల పరిహారం ఇస్తే సరిపోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10వేల పరిహారం ఇస్తే సరిపోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఒక్కో ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు రైతులకు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తారవ్వ అనే మహిళా రైతు ఆవేదన చూస్తే అర్థమవుతున్నదని తెలిపారు.
తారవ్వ అధికారుల కాళ్లు పట్టుకున్న వీడియోను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం భరోసానివ్వాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఒక్కో ఎకరానికి రూ.50వేలతో పాటు యాసంగి పంటల సాగు కోసం ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇచ్చి, రైతు భరోసా సాయాన్ని త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






