Kavitha Deadline : మహిళా హామీల అమలుపై ప్రభుత్వానికి కవిత డెడ్ లైన్ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-11 12:09:37  IST  )

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల(Promises Made TO Women) అమలు(Implement)కు రాష్ట్ర ప్రభుత్వాని(Congress Government)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC), తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) డెడ్ లైన్ విధించారు

Kavitha Deadline : మహిళా హామీల అమలుపై ప్రభుత్వానికి కవిత డెడ్ లైన్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల(Promises Made TO Women) అమలు(Implement)కు రాష్ట్ర ప్రభుత్వాని(Congress Government)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC), తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) డెడ్ లైన్ విధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8నాటికి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడుతామని ప్రకటించారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామమని.. కానీ ప్రభుత్వం మరిన్ని బస్సులు పెంచి మహిళలకు ప్రజా రవాణాను సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని కవిత తెలిపారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన ఇతర హామీల అమలులో దాటవేత వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 చొప్పున ఇప్పటివరకు రూ. 35,000 సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బాకీ పడిందన్నారు. తులం బంగారం, స్కూటీ హామీ ఎక్కడికి పోయాయని వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని ప్రకటించారు.

మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని లేదంటే తాము ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామన్నారు.

Next Story