Kavitha: ఏప్రిల్‍లో కొత్త పార్టీ ప్రకటన ప్రచారంపై కవిత క్లారిటీ

by Prasad Jukanti |

రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల మీద లేదని కవిత విమర్శించారు.

Kavitha: ఏప్రిల్‍లో కొత్త పార్టీ ప్రకటన ప్రచారంపై కవిత క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పత్తి రైతుల బాధ చూస్తే చాలా బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల మీద లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ వరంగల్ కి వచ్చి రైతు డిక్లరేషన్ అని మాటలు చెప్పారు తప్ప ఒక్క పని కూడా అమలు చెయ్యడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేదన్నారు. ఇవాళ ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. మెంథా తుపాన్ వస్తే పత్తిలో తేమ శాతం పెరుగుతుందని తెలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితుల రీత్యా పత్తిలో తేమ 20-25 శాతం ఉన్నా అంగీకరించాలని కేంద్ర మంత్రిని తాను కోరబోతున్నానన్నారు. జూబ్లీహిల్స్ లో రైతులు ఉంటే మా రైతుల కష్టాలు తీరేవని రైతులే చెప్పుకుంటున్నారని అన్నారు. పేదలకు ఈ ప్రభుత్వం విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తోందని ఫీజు రియంబర్స్ మెంట్ ఈఎంఐల మాదిరిగా వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సింబాలిక్ గా కాలేజీలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కాలేజీల యాజమాన్యాలకు తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

కొత్త పార్టీ ప్రచారంపై క్లారిటీ:

మార్చి-ఎప్రిల్ లో కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. అలాంటిదేమి లేదని ప్రజాబాట కార్యక్రమం ఏప్రిల్ 13 న ముగిస్తుందన్నారు. ఈ నాలుగు నెలల పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నామన్నారు. జాగృతి జనం బాట పొలిటికల్ ఎజెండా కాదని పబ్లిక్ ఎజెండాతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ యాత్ర కొనసాగుతున్న క్రమంలో సంస్థను బలోపేతం చేసుకుంటామన్నారు. అనేక మంది జాగృతి పాత కార్యకర్తలతో పాటు కొత్త వారు మాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Next Story