శ్రీరామనవమి రోజే కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’కి ముహూర్తం ఖరారు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-25 13:30:21  IST  )

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. శ్రీరామనవమి పర్వదినాన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.

శ్రీరామనవమి రోజే కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’కి ముహూర్తం ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ పాలిటిక్స్‌లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Telangana Praja Jagruthi) అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు (Registration) కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా, దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుందని సమాచారం.

మెట్టినింటి నుంచే పార్టీ విధివిధానాల ప్రకటన..

తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచే పార్టీ జెండా, గుర్తు, పార్టీ విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పని చేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగ కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామ నవమి రోజే ప్రకటించే చాన్స్ ఉంది.

Next Story