BRS MLA:అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన కౌశిక్ రెడ్డి

by Jakkula.Mamatha |

పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

BRS MLA:అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన కౌశిక్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు(శుక్రవారం) జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అ నేపథ్యంలో జాతీయ అవార్డు గ్రహీత టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ అరెస్టుని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) తీవ్రంగా ఖండించారు. పుష్ప-2 సినిమా విడుదల రోజు అభిమానులు సినిమా చూడడానికి అధిక సంఖ్యలో వస్తారని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉందని అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ఇలాంటి పనులకు తెలంగాణ(Telangana) రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నాయని ధ్వజమెత్తారు.

Next Story