- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఐపీఎస్ సంఘానికి కౌశిక్ రెడ్డి చాలెంజ్
వీణవంక ఘటనపై కౌశిక్ రెడ్డి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Paadi Kaushik Reddy) చాలెంజ్ విసిరారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం (Karimnagar CP Gaus Alam) ఇతర మతాల వారిని తమ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తాను అనలేదని ఒక వేళ అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలా నిరూపించని పక్షంలో లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పుకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని హెచ్చరించారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ (Telangana IPS Officers Association) చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ఇవాళ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సంఘాలు:
వీణవంక సమ్మక్క జాతరలో పాడి కౌశిక్ రెడ్డి ఆయన భార్య, కుమార్తెతో కలిసి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన సమయంలో పోలీసులతో వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శులు సిక్రమ్ సింగ్ మాన్, జయేశ్ రంజన్ వేర్వేరు ప్రకటనల ద్వారా ఖండించారు. కౌశిక్ రెడ్డి దురుద్దేశపూరితంగా నిరాధారంగా గౌస్ ఆలంపై ఆరోపణలు చేశారని పోలీస్ అధికారులు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన మతాన్ని కౌశిక్ రెడ్డి ప్రస్తావించారని ఐపీఎస్ అసోసియేషన్ తన లేఖలో పేర్కొంది. గౌష్ ఆలం ఇతర మతాల వారిని తమ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని కౌశిక్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని శాసనసభ అధికారులను కోరారు. ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణలపై ఇవాళ కౌశిక్ రెడ్డి స్పందిస్తూ వారికి సవాల్ విసిరారు.






