కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

by Ajay Maddhiboyina |

కార్తీకపౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు.

కార్తీక పౌర్ణమి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెడ్ డెస్క్: కార్తీకపౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకపూజలు చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరగటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటంతో పాటు అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆలయ కమిటీలు, నిర్వాహకులు సైతం అప్రమత్తం అయ్యారు.

Next Story