- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadi Srinivas: కర్మ ఈజ్ బ్యాక్.. కేటీఆర్‌కు సిగ్గులేదా? ప్రభుత్వ విప్ కౌంటర్ అటాక్!
చింత చచ్చినా పులుపు తగ్గన్నట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: చింత చచ్చినా పులుపు తగ్గన్నట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిపోయినప్పటికి ఆయనలో అహంకారం ఇసుమంతైనా తగ్గలేదని ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జనం ఛీ కొట్టి 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి తన బలుపును చూపిస్తున్నాడని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ గుర్తును గాడిదపై ఎక్కించి ఊరేగింపులు చేశామా అంటు అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో జిమ్మిక్కులు చేసి ప్రజల చైతన్యం ముందు చిత్తైనా కేటీఆర్ సిగ్గు రావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ సర్వేల పేరుతో మైండ్ గేమ్‌లు ప్లే చేసినా జనం ఛీ కొట్టారని అన్నారు. ఒక ఎన్నికల్లో గెలిచినందుకే మిడిసిపడుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారని తన అక్కసు అంతా వెళ్లగగ్గుతున్నాడన్నారు. కేటీఆర్.. ఒక ఎన్నిక కాదు.. వచ్చిన ప్రతి ఎన్నికల్లో నీ పార్టీని చిత్తు చిత్తు చేశాం.. మరిచిపోయావా..? అని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గాడిది గుడ్డు.. అయినా కేటీఆర్‌కు శరం రావడం లేదని అన్నారు. నీ బతుకు, నీ పార్టీ బతుకు గురించి నీ సొంత చెల్లి చెబుతుంది చూసుకో.. కర్మ ఈజ్ బ్యాక్ అని మీ చెల్లెలే చెబుతోంది.. అని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. నువ్వు నోరు మూసుకుంటే కొన్నాళ్లు నీ పార్టీ తెలంగాణలో బతుకుతుంది.. లేకుంటే నీ నోటిమాటకే బీఆర్ఎస్ మట్టికరుస్తుందని ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యారు.






