సివిల్ డ్రెస్‌లో ఉన్న హోంగార్డును చితకబాదిన యువకులు

by Disha Web Desk 12 |
సివిల్ డ్రెస్‌లో ఉన్న హోంగార్డును చితకబాదిన యువకులు
X

దిశ, శంకరపట్నం: కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డును శంకరపట్నం మండలంలోని చింతల పల్లె గ్రామంలో ఆదివారం రాత్రి యువకులు చితకబాదినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, గ్రామంలోని ఓ క్వారీ నుండి బండ లోడుతో వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. దీంతో ఆ లారీ డ్రైవర్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా కేశవపట్నం పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన కేశపట్నం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సివిల్ డ్రెస్ లోనే లారీ వద్దకు చేరుకున్నాడు.

అయితే హోంగార్డుకు యూనిఫామ్ లేకపోవడంతో సామాన్య వ్యక్తి అనుకున్న ఆ ఇద్దరు యువకులు హోంగార్డు పై చేయి చేసుకోగా యువకులను, పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. దీంతో ఓ వ్యక్తి పూచీకత్తుపై విడిపించి తీసుకెళ్లాడు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనకు సోమవారం ఉదయం వచ్చి కేశవపట్నం ఎస్‌ఐని కల్పించాలని, మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తికి విధుల్లో ఉన్న పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed